Cyber Crime | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): సైబర్ మోసాల వల్ల హైదరాబాద్ ప్రజలు రోజుకు సగటున రూ.2 కోట్ల చొప్పు న ఏటా రూ.800 కోట్ల వరకు నష్టపోతున్నారని, విద్యావంతులు సైతం అత్యాశకు పోయి ఈ మోసాల బారి న పడుతున్నారని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు ఇటీవల 7 బృందాలతో గుజరాత్లో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి వివిధ కేసుల్లో 36 మం దిని అరెస్టు చేశారని, వీరికి దేశవ్యాప్తంగా 983 కేసులతో, తెలంగాణలో 131 కేసులతో సంబంధం ఉన్నదని వెల్లడించారు. ఈ ముఠాల చేతిలో బాధితులు రూ.12.49 కోట్ల వరకు మోసపోయారని తెలిపారు. నిందితుల నుంచి రూ.1.51 కోట్లు రికవరీ చేసి, బాధితులు ఇప్పించామని, మరో రూ.2.89 కోట్లు ఫ్రీజ్ చేశామని సీపీ వివరించారు.
2న కలెక్టరేట్ల ముట్టడి ‘ బీసీ’ జాతీయ అధ్యక్షుడు జాజుల
హైదరాబాద్, ఆగస్టు24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సమగ్ర కులగణన ప్రారంభించి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే ప్రధాన డిమాండ్ తో సెప్టెంబర్ 2న కలెక్టరేట్ల ముట్టడికి బీసీ సంక్షేమ సంఘం పిలుపునిచ్చిం ది. సంఘం జాతీయ అధ్యక్షుడు జా జుల శ్రీనివాస్‌గౌడ్ శనివారం ప్రకటన విడుదల చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి నేపథ్యంలో 26న తలపెట్టిన కార్యక్రమాన్ని సెప్టెంబర్ 2కు వాయి దా వేసినట్టు పేర్కొన్నారు.
మంత్రుల సమీక్షకు హాజరుకాలేదని..సంగారెడ్డి ఆర్డీవోపై బదిలీ వేటు
సంగారెడ్డి, ఆగస్టు 24(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి ఆర్డీవో వసంతకుమారిపై బదిలీ వేటు పడింది. 21న మంత్రి రాజనర్సింహ సంగారెడ్డిలో పర్యటించారు. మంత్రి పర్యటనలో ప్రొటోకాల్ విధులు సక్రమం గా నిర్వహించలేదని, కలెక్టరేట్లో మంత్రి రాజనర్సింహ, ఇన్చార్జి మం త్రి కొండా సురేఖ నిర్వహించిన స మీక్షకు ఆర్డీవో వసంతకుమారి గైర్హాజరు కావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆర్డీవోను ఆదేశించారు. ఆర్డీవోను ఏటూరు నాగా రం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ట్రైబల్ వెల్ఫేర్)గా బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జహీరాబాద్ ఆర్డీవో రాజుకు సంగారెడ్డి ఆర్డీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ విషయం జిల్లా రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సీఎంఆర్ బకాయిలపై అధికారుల సీరియస్
మిల్లుల యజమానుల ఇంట్లో వస్తువులు స్వాధీనం
పెబ్బేరు/కొత్తకోట, ఆగస్టు 24 : సీఎంఆర్ ధాన్యం బకాయి పడిన రెండు మిల్లుల యజమానుల ఇంట్లోని వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలు వనపర్తి జిల్లా పెబ్బేరు, కొత్తకోట మం డలాల్లో శనివారం చోటుచేసుకున్నాయి. రంగాపురంలోని శివసాయి ఇండస్ట్రీస్ రైస్‌మిల్లు.. ప్రభుత్వానికి రూ. 3,57,22,693 సీఎంఆర్ ధాన్యానికి సంబంధించి బకాయి పడింది. జనుంపల్లిలోని మిల్లు యజమాని విజయ ఇంటికి వెళ్లి టీవీ, ఇన్వర్టర్, ఏసీ, స్కూటీలు, మిల్లులోని రిఫ్రిజిరేటర్‌ను, కొత్తకోట మండలం నాటవెల్లిలోని వెంకటేశ్వర ట్రేడర్స్ యజమాని వెంకటరమణ ఇంట్లోని కారు, ఏసీ, ఇన్వర్టర్లు, ఫ్రిజ్, టీవీలను తహసీల్దార్ కార్యాలయాలకు తరలించారు.
124 మందికి ‘ప్రగతి చక్ర’
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): టీజీఎస్ఆర్టీసీలో ఉత్తమ సేవ లు అందించిన 124మంది ఉద్యోగులకు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రగతిచక్ర అవార్డులు అందజేశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో శనివారం అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సంస్థ ఎండీ వీసీ సజ్జనార్, ఉన్నతాధికారులతో కలిసి అవార్డుగ్రహీతలకు ట్రోపీలు, ప్రశంసాపత్రా లు, పతకాలు, బ్యాడ్జీలు, నగదు రివార్డులు ప్రదానం చేశారు. వరంగల్-2 డిపో డ్రైవర్ మెరుగు సంపత్ కుటుంబ సభ్యులకు రూ.1.15కోట్ల విలువైన ప్రమాద బీమా చెక్ అందజేశారు. కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కృష్ణకాంత్, వినోద్‌కుమార్, వెంకటేశ్వర్లు, ఫైనాన్స్ అడ్వయిజర్ విజయపుష్ప, ఉషాదేవి పాల్గొన్నారు.
బదిలీల్లో పొరపాట్లు వాస్తవమే
హైదరాబాద్, ఆగస్టు24 (నమస్తే తెలంగాణ) : సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఇటీవల చేపట్టిన బదిలీ లు, పదోన్నతుల్లో కొన్ని త ప్పులు జరిగాయని కాంగ్రెస్ నేత హర్షవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. బాధితులు ఫోన్చేస్తేనే తాను వెళ్లానని, ఏ ఉద్యోగికీ నష్టం వాటిల్లకుండా చూడాలని అధికారులతో మాట్లాడానని, అంతే తప్ప అక్కడ మరేమీ లేదని పేర్కొన్నారు. గురుకుల బదిలీలు, పదోన్నతుల్లో అక్రమాలకు సంబంధించిన అంశాలపై ‘అర్రాస్.. ఎవరికి హర్షం..?’ పేరిట ‘నమస్తే తెలంగాణ’లో శనివారం ప్రచురితమైన కథనంలో తన పేరే స్ఫురణకు వచ్చేలా ఉందని, తప్పుడు సంకేతాలు వెళ్తాయంటూ హర్షవర్ధన్‌రెడ్డి స్పందించారు.