హైదరాబాద్, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ) : 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఫస్టియర్లో మొత్తం 4,57,704 సీట్లుండగా.. 1,96,442 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. మొత్తం సీట్లల్లో కేవలం 42 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దోస్త్ ద్వారా తొలుత మూడు విడుతల్లో సీట్లను భర్తీచేశారు. ఆ తర్వాత పలు విడుతల్లో సీట్ల భర్తీకి అవకాశానిచ్చారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ముగిసిన తర్వాత సైతం ప్రవేశాలకు అవకాశం కల్పించారు. అయినా 2 లక్షల్లోపే అడ్మిషన్లు నమోదయ్యాయి.
ప్రైవేట్లో 38 శాతమే..
రాష్ట్రంలో 816 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలుండగా, వీటిలో 3,44,793 సీట్లకు 38.39 శాతం మాత్రమే భర్తీ అయ్యాయి. గురుకుల డిగ్రీ కాలేజీల్లోని సీట్లకు డిమాండ్ అంతంతమాత్రంగానే ఉంటున్నది. యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 89 వేల సీట్లలో 61 శాతం సీట్లు భర్తీ కావడం గమనార్హం. డిగ్రీ ఫస్టియర్లో 4.57 లక్షల సీట్లుండగా ఇంటర్ పాసైన వారు తక్కువగా ఉండడంతోపాటు ఇంజినీరింగ్, నీట్లో ఎక్కువగా చేరుతుండడంతో సీట్లు అధికంగా మిగులుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది డిగ్రీ ఫస్టియర్లో 1,96,442 విద్యార్థులు ప్రవేశాలు పొందితే వీరిలో 1,05,329 విద్యార్థులు మహిళలే ఉన్నారు.
33