హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో అమృత్‌భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా తెలంగాణలో 38 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని రైల్వే అధికారులు శనివారం వెల్లడించారు. ఈ స్టేషన్ల అభివృద్ధి కోసం రూ.1830.4 కోట్లు కేటాయించినట్టు ప్రకటించారు.
రూ.430 కోట్లతో చర్లపల్లి రైల్వే టర్మినల్, సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులకు రూ.700 కోట్లు, హైదరాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రూ.309 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. మిగితా స్టేషన్లకు అవసరాల మేరకు నిధులు కేటాయించినట్టు తెలిపారు.