హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఎంసెట్‌కు గురువారం వరకు 1,80,240 మంది దరఖాస్తు చేసుకొన్నారు. ఇంజినీరింగ్‌కు 1,14,989, అగ్రికల్చర్, మెడికల్‌కు 65,033 దరఖాస్తులు రాగా, రెండు క్యాటగిరీలకు కలిపి 218 దరఖాస్తులు వచ్చాయి.
గత ఫిబ్రవరి 28న టీఎస్ ఎంసెట్‌కు నోటిఫికేషన్‌ను జేఎన్టీయూహెచ్ ఇచ్చిన విషయం విదితమే. మార్చి 3 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉన్నది. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ పరీక్షలు కొనసాగుతాయి.