పెబ్బేరు మిల్లులో 18 కోట్ల ధాన్యం మాయం
వనపర్తి జిల్లా పెబ్బేరులో రూ.18 కోట్ల విలువైన సీఎంఆర్ మాయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని సాయి గణేశ్ రైస్ మిల్లులో సోమవారం విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రూ.18,35,83,057 విలువైన సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టినట్టు తేలింది.
- విజిలెన్స్, పౌరసరఫరాల తనిఖీల్లో వెల్లడి
పెబ్బేరు, ఆగస్టు 24 : వనపర్తి జిల్లా పెబ్బేరులో రూ.18 కోట్ల విలువైన సీఎంఆర్ మాయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని సాయి గణేశ్ రైస్ మిల్లులో సోమవారం విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రూ.18,35,83,057 విలువైన సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టినట్టు తేలింది. 2022-23 ఏడాది యాసంగికి సంబంధించిన 4,946.080 టన్నుల ధాన్యం కనిపించకుండా పోయినట్టు తనిఖీల్లో వెలుగు చూసినట్టు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఆంజనేయులు తెలిపారు. ఇటీవల పట్టణంలోని రెండు మిల్లుల్లో పెద్ద ఎత్తున ధాన్యం మాయమైనట్టు తేలింది. సాయిగోపాల ఇండోటెక్ మిల్లులో రూ.15 కోట్ల ధాన్యం, సత్యసాయి మిల్లులో రూ.24.9 కోట్ల ధాన్యం కన్పించకుండా పోయింది. అలాగే శ్రీరంగాపురంలోని ఆల్ అజీజ్ రైస్ మిల్లులోనూ రూ.31 కోట్ల ధాన్యాన్ని యజమాని పక్కదారి పట్టించినట్టు బయటపడింది. ఈ మిల్లులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

