హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : అవినీతి ఏడీఈ బినామీ రాజేశ్ ఇంట్లోని బాత్రూమ్లో రూ.17 లక్షల నగదు లభ్యమైంది. ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో నగదుతోపాటు వివిధ ప్రాంతాల్లో ఆస్తులకు సంబంధించి 20కి పైగా కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్‌కు చేవెళ్ల ఏడీఈ రాజేశ్‌ను బినామీగా గుర్తించారు.
కాగా విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్‌కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను బుధవారం చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు బినామీల్లో ఒకరైన చేవెళ్ల ఏడీఈ రాజేశ్ ఇండ్లల్లో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.