Dogs Run | గట్టు : జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బలిగేరలో దిగంబరస్వామి జాతర సందర్భంగా శనివారం శునకాల పరుగు పందెం పోటీలు నిర్వహించారు. పోటీలను సర్పంచ్ బాసు హనుమంతు ప్రారంభించగా.. 17 శునకాలు పాల్గొన్నాయి.
పోటీలను తిలకించడానికి స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రసవత్తరంగా సాగిన పోటీల్లో కర్ణాటక సిద్ధిరాంపురం తేజిబాయి కాల్ శునకం ప్రథమ, బలిగేర కిరాక్ కాల్ లక్ష్మణ్ శునకం ద్వితీయ, కర్ణాటక మలబాది ఇన్సెట్బాయి శునకం తృతీయ విజేతగా నిలిచాయి. రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేల నగదు బహుమతిని జడ్పీటీసీ బాసు శ్యామల అందజేశారు.