శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 15, 2020 , 22:18:09

తెలంగాణలో కొత్తగా 1,597 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,597 కరోనా కేసులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో బుధవారం 1,597 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 796 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 39,342 కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ 11 మంది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 386 కు చేరింది. ఇవాళ 1,159 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 25,999 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 12,958 మంది మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo