జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటనలో 15 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..హిందూపురం నుంచి హైదరాబాద్కు 22 మంది ప్రయాణికులతో బయలుదేరిన మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. రాత్రి 2గంటల సమయంలో మానవపాడు స్టేజ్( NH 44) వద్దకు రాగానే అనంతపురం నుంచి జమ్ము కాశ్మీర్ వెళ్తున్న లారీ వెనక నుండి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ను ఢీకొనడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.