హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : లోక్సభ ఎన్నికలకు సోమవారం 144 అభ్యర్థులు 169 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల గడువు ఈనెల 25న గురువారంతో ముగియనుంది. సోమవారం నామినేషన్లు దాఖలు చేసిన వారిలో నిజామాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్, హైదరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్, నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా క్యామ మల్లేశ్, వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్ కుమార్ తదితరులు నామినేషన్లు దాఖలు చేశారు.