హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): శ్యామాప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద తెలంగాణలో 1,425 పనులు జరుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రూర్బన్ మిషన్ అమలు తీరు, నిధుల ఖర్చుపై లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి సమాధానమిస్తూ.. తెలంగాణలోని 17 క్లస్టర్లలో ఈ పనులు జరుగుతున్నట్టు తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని అల్లాపూర్ ఎస్ క్లస్టర్లో 80 పనులు జరుగుతున్నట్టు చెప్పా రు. మొత్తంగా 1,425 పనులకు అవసరమైన నిధులు మంజూరు చేశామని, ఈ నెలాఖరుకు పనులు పూర్తవుతాయని వివరించారు.