హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు ట్రాన్స్మిషన్ లైన్ల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలసత్వం వహిస్తున్నది. కానీ, ఈ విషయంలో పవర్ గ్రిడ్ కా ర్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) మాత్రం ముందంజలో ఉ న్నది. తెలంగాణలో పెద్ద ఎత్తున ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ లైన్లు ఏర్పాటు చేసి 13 గిగావాట్ల సామర్థ్యం గల గ్రీన్ ఎనర్జీ కారిడార్‌ను నిర్మించనున్నది. దీంతో అత్యంత చౌకగా దొరికే సోలార్, పవన విద్యుత్తును దేశంలో ఎక్కడి నుంచైనా తీసుకునే అవకాశం లభిస్తుంది. విద్యుత్తు డిమాండ్, వినియోగాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర విద్యుత్తు అథారిటీ (సీఈఏ) కొత్త లైన్లు వేయాలని పీజీసీఐఎల్‌ను ఆదేశించింది. ముఖ్యంగా ఇంటర్‌స్టేట్ ట్రాన్స్మిషన్ లైన్లను పెద్ద ఎత్తున నిర్మించాలన్నది. కొత్త లైన్ల నిర్మాణాన్ని 2027లో మొదలుపెట్టి 2032 కల్లా పూర్తిచేయాలని స్పష్టం చేసింది. 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ ట్రాన్స్మిషన్ లైన్లు వేయాలని సూచించింది.
4 వేల కిలోమీటర్ల కొత్త లైన్
రాష్ట్రంలో కొత్తగా 19 వేల మెగావా ట్ల గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. వీటి నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తును వాడుకునేందుకు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి నేషనల్ గ్రిడ్‌తో అనుసంధానించాల్సి ఉన్నది. 28,100 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేసే ట్రాన్స్మిషన్ లైన్లు అవసరమని సీఈఏ తే ల్చింది. తెలంగాణలో కొత్తగా 4,839 కి.మీ. మేర ట్రాన్స్మిషన్ లైన్లు వేయాల్సిన అవసరమున్నదని స్పష్టం చేసిం ది. కరీంనగర్ నుంచి నిజామాబాద్, నిజామాబాద్ నుంచి మెదక్, రంగారెడ్డి, వరంగల్‌లోని 720 కేవీ లైన్లను 400 కేవీలైన్లతో అనుసంధానిస్తారు. 13 రాష్ర్టాల్లో 51,126 కి.మీ. మేర ట్రాన్స్మిషన్ లైన్లు వేయాల్సి ఉండ గా.. అందు లో 10% లైన్లు తెలంగాణలో వేయాల్సి ఉన్నది.
జిల్లాలవారీగా లక్ష్యం
జిల్లా గిగావాట్లు