హైదరాబాద్, నవంబర్ 18(నమస్తే తెలంగాణ) : వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయ అభివృద్ధికి రూ.127.65 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆలయ కాంప్లెక్స్ విస్తరణతోపాటు ఆధునిక సౌకర్యాల కల్పనకు రూ.76కోట్లు, మూలవాగు వంతెన నుంచి ఆలయం వరకు రోడ్డు విస్తరణ కోసం భూసేకరణకు రూ. 47,85,36,100, బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల వరకు డ్రైనేజీ నిర్మాణానికి రూ. 3.8 కోట్లు కలుపుకొని మొత్తం 127.65 కోట్లు మంజూరు చేస్తూ వేర్వేరు ఉత్తర్వులు జారీచేసింది. ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయించిన రూ. 76కోట్లలో రూ. 50 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నిధుల నుంచి మంజూరు చేయగా, మిగిలిన రూ.26 కోట్లు వచ్చే 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నిధుల నుంచి మంజూరు చేయనున్నట్టు పేర్కొన్నారు. 4 అక్టోబర్ 2023న జారీచేసిన ఉత్తర్వులకు అనుగుణంగా రోడ్డు విస్తరణ కోసం సేకరించే ఆస్తులకు నష్ట పరిహారం చెల్లింపులకు రూ. 47, 85,36,100 మంజూరు చేసినట్టు
వెల్లడించారు.