రాజధాని శివారు మున్సిపాలిటీలకు 1200 కోట్లు

- మంచినీటి సమస్య పరిష్కారానికి నిధులు
- అన్ని గ్రామాల్లో వీధిదీపాలకు మూడో వైరు
- ల్యాండ్‌పూలింగ్ ద్వారా లే అవుట్ల అభివృద్ధి
- నెలలోగా వైకుంఠధామాల నిర్మాణం పూర్తి
- రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు
- పల్లె, పట్టణ ప్రగతిపై క్యాబినెట్‌కు నివేదికలు
హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలలో మంచినీటి సమస్య పరిష్కారానికి తక్షణమే రూ.1200 కోట్ల అదనపు నిధులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంజూరుచేశారు. నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంనుంచి అధికారులను ఆదేశించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిపై పంచాయతీరాజ్, మున్సిపల్‌శాఖల అధికారులు క్యాబినెట్‌కు నివేదికలు సమర్పించారు. ఈ నివేదికలను పరిశీలించిన మంత్రిమండలి.. నెలరోజుల్లోగా వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తిచేయాలని ఆదేశించింది. అన్ని గ్రామాల్లో వీధి దీపాల కోసం మూడో వైరును తప్పకుండా ఏర్పాటుచేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ల్యాండ్ పూలింగ్ వ్యవస్థ ద్వారా ప్రత్యేకంగా లే అవుట్లను అభివృద్ధిచేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన అవకాశాలను పరిశీలించి విధి విధానాలను రూపొందించాలని మున్సిపల్‌శాఖ అధికారులను ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

