శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 26 ః టాంజానియా దేశస్థుడి కడుపులోంచి 1,157 గ్రాముల కొకైన్ లభించినట్టు డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు తెలిపారు. దీని విలువ రూ 11.57 కోట్ల విలువ ఉంటుందని చెప్పారు. జోహెన్స్‌బర్గ్ నుంచి టాంజానియా దేశస్థుడు కొకైన్‌తో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్నట్టు డీఆర్ఐ అధికారులకు విశ్వసనీయంగా తెలిసింది. అప్పటికే సిద్ధంగా ఉన్న డీఆర్ఐ అధికారులు ఈ నెల 21న శంషాబాద్‌కు చేరుకున్న అతనిని అదుపులోకి తీసుకొని విచారించారు. కడుపులో కొకైన్ దాచుకున్నట్టు ఒప్పుకున్నాడు. వైద్యుల సహాయంతో అతని కడుపులోంచి 79 కొకైన్ క్యాప్సుల్స్ బయటికి తీసినట్టు డీఆర్ఐ అధికారులు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.