హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలకానున్నాయి. మధ్యాహ్నం 1గంటకు రవీంద్రభారతిలో సీఎం రేవంత్రెడ్డి ఫలితాలు విడుదల చేస్తారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించారు. దాదాపు 5లక్షల మంది హాజరయ్యారు. ఈ సారి గ్రేడింగ్తోపాటు మార్కులు ఇవ్వనున్నారు.
పదో తరగతి పరీక్షల ఫలితాల కోసం క్లిక్ చేయండి