హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : దసరా పండుగ అనంతరం తిరుగు ప్రయాణం నేపథ్యంలో ప్రజలకు రవాణాపరమైన అసౌకర్యం కలుగకుండా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు 1,050 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. అత్యధికంగా వరంగల్ రీజియన్ నుంచి 229, కరీంనగర్ నుంచి 211, నల్లగొండ నుంచి 137 ప్రత్యేక సర్వీసులను నడిపింది. ఆదివారం రాత్రి 9 గంటల వరకు రద్దీ కొనసాగనున్నది. సోమవారం కూడా హైదరాబాద్కు ప్రయాణికుల రద్దీ ఎకువగా ఉండనున్నది. రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.