హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) ఎన్నికల్లో మొత్తం 103 నామినేషన్లు వచ్చినట్టు అధికారులు తెలిపారు. శుక్రవారం జాబితా విడుదల చేశారు. ఈ నెల 11న ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనున్నది. 12న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. మెడికల్ కౌన్సిల్లో 25 మంది డాక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఇందులో 12 మందిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. మిగతా 13 మందిని టీఎస్ఎంసీలో రిజిస్టర్ అయిన డాక్టర్లు తమ ఓటు హక్కు ద్వారా ఎన్నుకోనున్నారు. నవంబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నారు.