హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా మల్టీజోన్ -2లో ఆదివారం మరో 1,015 మంది ప్రభుత్వపాఠశాలల్లోని టీచర్లకు స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పదోన్నతులు దక్కాయి. పదోన్నతులు పొందిన వారిలో గ్రేడ్ -2 భాషాపండితులు, పీఈటీలు, సెకండరీ గ్రేడ్ టీచర్లున్నారు. ఇదే మల్టీజోన్ -2లో జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూల్ టీచర్ల బదిలీలు పూర్తికాగానే పదోన్నతులు చేపడతామని అధికారులు వెల్లడించారు.