హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాల్లో హైదరాబాద్ ఉప్పల్లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించినట్టు యాజమాన్యం తెలిపింది.
పాఠశాలకు చెందిన ఎర్రమిల్లి అంత్ర, దేశాయి ఓజశ్విని 490 మార్కులు, కందిబండ తన్మయి 484, క్రిష్ 483, ఎన్ ప్రియాన్ష్, లిఖిషా మలేకర్, వెన్ను సాయికౌస్తబ్ 481, మనామీ చటర్జీ, రవిరాల శ్రీనిజ 480 మార్కులు సాధించారు. పాఠశాలకు చెందిన మరో 19 మంది విద్యార్థులు 470 మార్కులకు పైగా సాధించి సత్తా చాటారని పేర్కొన్నది.