HMDA | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): రెరా కార్యదర్శి, గతంలో హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయం, ఆయన బంధువుల ఇండ్లపై ఏసీబీ ఏ కకాలంలో దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించినట్టు తెలిసింది. 14 బృందాలు 20 చోట్ల చేపట్టిన ఈ సో దాలు బుధవారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. మణికొండలోని ఆదిత్యపోర్ట్ వ్యూలో విల్లా నంబర్ 25లో శివబాలకృష్ణ నివాసం ఉంటున్నారు. 2018 నుంచి 2023 వరకు హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన, ఆరు నెలల క్రితం రెరా(రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఆథారిటీ) కార్యదర్శిగా బది లీ అయ్యారు. మెట్రోరైల్ ప్లానింగ్ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శివబాలకృష్ణపై అవినీతి ఆరోపణలు రావటంతో ఆయన ఆస్తుల చిట్టాపై ఇటీవల ఏసీబీ ఆరా తీసింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆధారాలు సేకరించి.. సోదాలు నిర్వహించింది. ఇందులో రూ.20 కోట్ల నగదు, ఖరీదైన సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వాచ్‌లు, కిలోలకొద్దీ బంగారు, వెండి ఆభరణాలు, విలువైన బహుమతు లు, వందల సంఖ్యలో డాక్యుమెంట్లను గుర్తించినట్టు తెలిసింది. గురువారం కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశాలున్నాయంటూ ఏసీబీ అధికారులు వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్టు వివరించారు.
హెచ్ఎండీఏలో కలవరం
శివబాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు హెచ్ఎండీఏలో కలకలం రేపాయి. ఏసీబీ దాడుల సమాచారంతో అమీర్‌పేట స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లోని హెచ్ఎండీఏ కార్యాలయంలోని పట్టణ ప్రణాళికా విభాగం(ప్లానింగ్)లో నిశ్శబ్దం నెలకొన్నది. ఏసీబీ అధికారులు కార్యాలయంలోనూ సోదాలు చేస్తారన్న ప్రచారంతో ఉన్నతాధికారులు ఆందోళనకు గురయ్యారు.