సికింద్రాబాద్, జూలై 8: యూనివర్సిటీల సమస్యలపై విద్యార్థి సంఘాల నేతలతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చర్చించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి డిమాండ్ చేశారు. సో మవారం ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రా ష్ట్రంలోని అన్ని వర్సిటీలకు రాజకీయ జోక్యం లేకుండా సామాజికకోణంలో రెగ్యులర్ వీసీల ను, విద్యాశాఖకు మంత్రిని తక్షణమే నియమించాలని, వర్సిటీల అభివృద్ధికి బడ్జెట్లో 10 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నెలాఖరులోగా వీసీలను నియమించకపోతే చలో అసెంబ్లీ చేపడుతామని హెచ్చరించారు. విశ్వవిద్యాలయాల పెండింగ్ ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని కోరారు. మౌలిక సదుపాయాలు కల్పించాలని, నూతన విద్యార్థుల పరిశోధనలను ప్రోత్సహించాలని, పీహెచ్డీ నోటిఫికేషన్ను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ కార్యదర్శి రవినాయక్, ఉపాధ్యక్షులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.