హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తేతెలంగాణ): తమ బస్సుల్లో బెంగళూరుకు ప్రయాణించే వారికి టికెట్ చార్జీలో 10% రాయితీ ఇస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ, వైస్ చైర్మన్ వీసీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రాయితీతో ప్రయాణికులకు రూ. 100 నుంచి రూ.160 వరకు ఆదా చేసుకోవచ్చని పేర్కొన్నారు. టికెట్లు ముందస్తుగా బుక్ చేసుకునేందుకు httpsః //tgsrtc.in వెబ్సైట్ను సందర్శించాలని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియో గం చేసుకోవాలని ఆయన కోరారు.