గుండాల/గణపురం, జూలై 25: స్పెషల్ పార్టీ పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం-ములుగు జిల్లా సరిహద్దు గుండాల మండలం దామరతోగు అడవుల్లో గురువారం చోటుచేసుకున్నది. దామరతో గు అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు స్పెషల్ పార్టీ పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు.
గమనించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన స్పెషల్ పార్టీ పోలీసులు కాల్పులకు దిగారు. దీంతో ఒక మావోయిస్టు మృతిచెందాడు. ఇతడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన నల్లమారి అశోక్ అలియాస్ విజేందర్గా గుర్తించారు.