హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): సివిల్స్ మెయిన్స్‌కు సన్నద్ధం అవుతున్న జూలూరి సందీప్‌కుమార్‌కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని తాజ్ దక్కన్లో అందజేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ సందీప్‌కుమార్‌ను అభినందించారు. ఐవీఎఫ్ (ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్) అందిస్తున్న ప్రోత్సాహకారాన్ని సద్వినియోగం చేసుకొని సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించాలని సూచించారు. రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ తెలంగాణలోనే కాకుండా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రిలిమ్స్ పాసై, మెయిన్స్ రాసిన 23 మందికి ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఐవీఎఫ్ 7 సంవత్సరాల నుంచి అందిస్తున్న సహకారాన్ని, భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పారు.