(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): ఏటా లక్షలాది మంది భారతీయులు ఇక్కడి పౌరసత్వాన్ని వదులుకొంటున్నారు. 2024లోనే 2,06,378 మంది ఇండియన్ సిటిజన్‌షిప్‌ను వదులుకొన్నారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ గురువారం పార్లమెంట్‌కు తెలియజేసింది. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత పౌరసత్వాన్ని వదులుకొంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బీజేపీ పాలనలో నెలకొన్న సమస్యలే ఇండియన్స్న విదేశాల వైపు మొగ్గు చూపడానికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దేశాన్ని ఎందుకు విడిచిపోతున్నారంటే?
ఏ సంవత్సరం.. ఎంతమంది పౌరసత్వం వదులుకొన్నారు?
2014 ; 1.29 328
2015 ; 1.31 489
2016 ; 1.41 603
2017 ; 1.33 049
2018 ; 1.34 561
2019 ; 1.44 017
2020 ; 85 256
2021 ; 1.63 370
2022 ; 2.25 620
2023 ; 2.16 219
2024 ;2.06 378