గజ్వేల్, మార్చి 1 : ఏఎంసీ పదవి ఇప్పిస్తానంటే గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డికి రూ.1.60 కోట్లు ఇచ్చానని కాంగ్రెస్ మనోహరాబాద్ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి పేర్కొన్నారు. శనివారం గజ్వేల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన వద్ద డబ్బులు తీసుకుని తీరా అన్యాయం చేశాడని, ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలతో బయట పెడుతానని తెలిపా రు. పార్టీ కోసం ఎకరం భూమి అమ్మినట్టు తెలిపారు. తన దగ్గర డబ్బులు తీసుకుని పట్టించుకోవడం లేదన్నారు. తనకు న్యాయం జరగకపోతే సీఎం రేవంత్రెడ్డి ఇంటి వద్ద విషం డబ్బాతో కూర్చుంటానని హెచ్చరించాడు. టీపీసీసీ అధికార ప్రతినిధి నాయిని యాదగిరి మాట్లాడుతూ.. గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీకి 33 వేల ఓటు బ్యాంకు ఉంటే నర్సారెడ్డికి డిపాజిట్ దక్కలేదని గుర్తుచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో నీలం మధు పంపిన డబ్బులను తీసుకుని ఆయన ఓటమికి కారణం అయినట్టు ఆరోపించారు. డీసీసీ అధ్యక్షుడిగా ఎవరెవరి దగ్గ ర ఎన్ని డబ్బులు తీసుకున్నారో తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని, మీనాక్షినటరాజన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు.