పటాన్చెరు రూరల్, ఏప్రిల్ 29 : గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్కు చెందిన సీఎస్ఈ విద్యార్థిని కారుమూరు ప్రియాంకరెడ్డి ప్రాంగణ నియామకాల్లో అమెజాన్ కంపెనీకి రూ. 1.4 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికైంది. మంగళవారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్లోని కెరీర్ గైడెన్స్ సెంటర్ అచీవర్స్ డే నిర్వహించింది. ప్రాంగ ణ నియామకాల్లో ఎంపికైన విద్యార్థులకు నియామకపత్రాలతోపాటు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి సీట్లు పొందిన అభ్యర్థులకు ప్రవేశపత్రాలు అందజేశారు. 270కిపైగా దేశీయ, బహుళజాతి కంపెనీలు ప్రాంగణ నియామకాలు నిర్వహించాయి. తొలిసారి, ప్రభుత్వరంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) గీతంలో ప్రాంగణ నియామకం చేపట్టి, ముగ్గురు ఈసీఈ విద్యార్థులను ఫిక్స్డ్ టర్మ్ ఇంజినీర్లుగా ఎంపిక చేసింది. అట్లాసియన్ రూ.60 లక్షలు, మైక్రోసాఫ్ట్ రూ. 51లక్షల వేతన ప్యాకేజీలతో గీతం విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి.