హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : టోల్‌ప్లాజాల వద్ద డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ టోల్ నియమ నిబంధనలను సవరించింది. వాహనాలకు ఫాస్టాగ్ లేకపోతే నగదు రూపంలో చెల్లించాల్సి వస్తే.. యూపీఐ ద్వారా చెల్లించే రుసుము కంటే అధికంగా 1.25 రెట్లు వసూలు చేయనున్నారు.
ఈ కొత్త నిబంధనలు నవంబర్ 15 నుంచి అమలులోకి రానున్నాయి. అధిక రుసుమును తప్పించుకోవాలంటే తప్పనిసరిగా వాహనాలకు ఫాస్టాగ్ ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర మంత్రిత్వ శాఖ సూచించింది.