స్త్రీ నిధి : కంప్యూటర్లు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి
మంత్రి ఎర్రబెల్లి | స్త్రీ నిధి ద్వారా ఏర్పాటు చేసిన 4 కోట్ల 31 లక్షల రూపాయలు విలువైన 632 కంప్యూటర్లు, యూ.పీ.యస్ లు, ప్రింటర్లను రాష్ట్రంలోని మండల, పట్టణ సమాఖ్యలకు, నైబర్ హుడ్ సెంటర్లకు మంత్రి పంపిణీ చేశారు.

హైదరాబాద్ : రాష్ట్రంలో స్త్రీ నిధి ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 వేల 60 కోట్ల రూపాయలను మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణాలుగా అందజేయనున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అందులో భాగంగా 2 వేల 340 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతంలోని మహిళా సంఘాలకు, 7 వందల 20 కోట్ల రూపాయలు పట్టణ ప్రాంతాలలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణంగా అందజేస్తామని ఆయన తెలిపారు.
రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం స్త్రీ నిధి ద్వారా ఏర్పాటు చేసిన 4 కోట్ల 31 లక్షల రూపాయలు విలువైన 632 కంప్యూటర్లు, యూ.పీ.యస్ లు, ప్రింటర్లను రాష్ట్రంలోని మండల, పట్టణ సమాఖ్యలకు, నైబర్ హుడ్ సెంటర్లకు మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మంట్లాడుతూ…రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్త్రీ నిధి ద్వారా లక్ష వరకు పాడి పశువుల కొనుగోలుకు రుణ సౌకర్యం అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. శ్రీనిధి విజయ డెయిరీ, కరీంనగర్ డెయిరీ, ముల్కనూరు మహిళా సహకార డెయిరీ, నార్ముల్ డెయిరీల సహకారంతో సుమారు మూడు వేల గ్రామాల రైతులతో సమన్వయం చేసుకొని పాడి పరిశ్రమ అభివృద్ధి చేస్తున్నమని మంత్రి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు స్త్రీ నిధి ద్వారా 742 కోట్ల రుణాలను అందించగా, గత ఏడేళ్ల కాలంలో 11 వేల 683 కోట్ల రూపాయలను మహిళా సంఘాల సభ్యులకు రుణంగా అందించామని ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 56 లక్షల మంది మహిళలు, 5 లక్షల 50 వేల సంఘాలు, 22 వేల 300 గ్రామ సమాఖ్యలు, 619 మండల, పట్టణ సమాఖ్యలు భాగస్వామ్యం ఉన్న ఏకైక సంస్థ స్త్రీ నిధి యని దయాకర్ రావు అన్నారు. గత ఏడేళ్ళ కాలంలో 220 కోట్ల 40 లక్షల రూపాయలను స్త్రీనిధి లాభంగా పొందిందని మంత్రి తెలిపారు.
సురక్ష భీమా పథకం వల్ల స్త్రీనిధి లో రుణం పొందిన వారు, వారి సంఘాలు లబ్ధి పొందుతున్నాయని ఆయన తెలిపారు. ఈ పథకంతో స్వయం సహాయక సంఘాల సభ్యులందరికీ ఒక లక్ష రూపాయలు వరకు జీవిత బీమా పథకం అమలు చేస్తున్నామని ఆయన అన్నారు.
దీనికి తోడుగా స్త్రీనిధి మహిళా సభ్యుల పిల్లలు ఇంటర్మీడియట్ చదివేందుకు స్కాలర్ షిప్ లు అందజేస్తున్నామని ఆయన అన్నారు.
గ్రామీణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలనకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. కార్యక్రమానికి స్త్రీనిధి రాష్ట్ర అధ్యక్షురాలు ఇందిర అధ్యక్షత వహించారు. స్త్రీనిధి మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

