హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్-2 వి ద్యార్థులు ఏ పట్టణంలో పరీక్ష రాయ నున్నారో తెలిపే సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. వివరాలను వెబ్సైట్లో ఉంచినట్టు పరీక్షల విభాగం సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సాధనా పరాశర్ వెల్లడించారు. జేఈఈ మెయిన్-2 ఎగ్జామ్ను 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో నిర్వహించనున్నారు.