హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై జాతీయ మానవ హకుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించింది.
ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి రెండువారాల్లోగా నివేదిక సమర్పించాలని ఏపీ సీఎస్‌ను ఆదేశించింది.