అలంపూర్, సెప్టెంబర్ 1 : తమకు వారసత్వంగా సంక్రమించిన నాలుగున్నర ఎకరాల ఆస్తిని పేదలకు ఇస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి దివంగత సురవరం సుధాకర్‌రెడ్డి సతీమణి విజయలక్ష్మి ప్రకటించారు. సోమవారం జోగుళాంబగద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడులో నిర్వహించిన సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభలో ఆమె ప్రకటించారు. సుధాకర్‌రెడ్డి తన చివరిశ్వాస వరకూ పేదల కోసమే పరితపించారని గుర్తుచేశారు. మరణించిన తర్వాత కూడా ఆయన పార్థివదేహాన్ని మెడికల్ విద్యార్థుల కోసం అందజేసినట్టు తెలిపారు.