
హుజూరాబాద్‌టౌన్, అక్టోబర్29 : మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడల్ ఈవీఎంలోని కారు గుర్తుకు ఓటు వేయాలని కోరితే.. దానిని రాజ్ న్యూస్ ఛానల్ బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేసినట్టు ఈ నెల 28న ‘ఈటెలకు ఓటు వేయమంటున్న హరీశ్‌రావు, ఇదిగో సాక్ష్యం’ అనే హెడ్డింగ్‌తో తప్పుడు కథనాన్ని ప్రసారం చేసింది. ప్రజల్లో గందరగోళం సృష్టించి గొడవలు జరిగేలా తప్పుడు వార్త ప్రసారం చేశారని హుజూరాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త టేకుల శ్రవణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు హుజూరాబాద్ టౌన్ సీఐ వీ శ్రీనివాస్ శుక్రవారం రాత్రి తెలిపారు. సదరు ఛానల్ యాజమాన్యానికి నోటీసులు అందజేసి కేసు విచారణ జరుపుతున్నట్టు సీఐ వెల్లడించారు.