హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థి గోవిందు ఆరుష్ పేపర్-2ఏ (బీఆర్క్) ఓబీసీ ఎన్సీఎల్ ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. జనవరి 30న, ఏప్రిల్ 9న పేపర్-2 పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. బీఆర్క్ పేపర్లో ఇద్దరు, బీ ప్లానింగ్‌లో ముగ్గురు విద్యార్థులు వందశాతం మార్కులు సాధించారు. రాష్ర్టానికి చెందిన ఆరుష్ బీఆర్క్ బీసీ ఎన్సీఎల్ ఆలిండియా టాపర్‌గా నిలిచాడు.
హైదరాబాద్, మే23 (నమస్తే తెలంగాణ): బీసీ సంక్షేమశాఖకు ప్రభుత్వం రూ.153.4కోట్లను మంజూరు చేసింది. బీసీ స్టడీ సర్కిల్ నిర్వహణకు బడ్జెట్లో 50.08కోట్లను ప్రతిపాదించగా ప్రస్తుతం రూ.12.52కోట్లు, బీసీ గురుకులాల నిర్వహణకు రూ.563.55కోట్లను ప్రతిపాదించగా, అందులో 140.88 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.