హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ పేరును.. తెలంగాణ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్గా మార్పు చేయాలని ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ పీ మధుసూదన్ ఇంటర్ విద్యాశాఖను కోరారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలని బుధవారం బోర్డు సెక్రటరీ వినతిపత్రం అందజేశారు.