ట్రాఫికర్‌కు చెక్

- హైదరాబాద్‌లో మరో ఆర్యూబీ రెడీ
- కూకట్పల్లి-హైటెక్‌సిటీ మధ్య నిర్మాణం
- ఈ మార్గం ఇకపై సిగ్నల్ ఫ్రీ
- నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ): హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ రహితంగా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పానికి సోమవారం మరో ముందడుగు పడనున్నది. కూకట్పల్లి-హైటెక్‌సిటీ మధ్య నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ)ని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ)లో భాగంగా ఈ ఆర్యూబీని నిర్మించారు. రూ.66.59 కోట్ల వ్యయంతో 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పుతో దీనిని నిర్మించారు. ఈ ఆర్యూబీ అందుబాటులోకి వస్తే కూకట్పల్లి-హైటెక్‌సిటీ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ చిక్కులు తప్పుతాయి. ఈ ఆర్యూబీ నిర్మాణానికి ముందు శేరిలింగంపల్లి నుంచి వచ్చే వరదనీరు ఈ బ్రిడ్జి కింద నుంచే వెళ్లేది. బ్రిడ్జి ఎప్పుడూ నీటితో నిండి ఉండేది. భారీ వర్షాలు పడితే ఈ మార్గంలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయేవి. వరదనీటిని అక్కడే నిల్వ చేసేందుకు బ్రిడ్జి కింద పెద్ద సంపును నిర్మించారు. అందులోని నీటిని మూసాపేట సర్కిల్లో హరితహారం మొక్కలకు అందిస్తున్నారు.

- నిర్మాణ వ్యయం 66.59 కోట్లు
- ఆర్యూబీ పొడవు 410 మీటర్లు
- వెడల్పు 20.60 మీటర్లు
ఇవీ కూడా చదవండి…
టీఆర్ఎస్తోనే కులవృత్తులకు వైభవం
ఎస్‌హెచ్‌జీలకు రికార్డు రుణాలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

