సంగెం, మార్చి 29 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం వరంగల్ జిల్లా సంగెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను కేటీఆర్ వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సీహెచ్ మాధవరెడ్డి, పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి జనగాం రమేశ్ ఉన్నారు.