రోమ్, జూన్ 20: ఇటలీలో భారత వ్యవసాయ కార్మికుడు అమానవీయ పరిస్థితుల్లో చనిపోయాడు. గడ్డికోసే మిషన్లో కార్మికుడి చేయి పడి తెగిపోగా, బాధితుడిని దవాఖానకు తీసుకెళ్లి చికిత్స అందించకుండా ఇంటి వద్ద రోడ్డు పక్కన పడేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో దవాఖానకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. రోమ్కు 50 కిలోమీటర్ల దూరంలోని ఇటలీ లాటినాలో ఈ దారుణ ఘటన బుధవారం చోటుచేసుకున్నది. సత్నామ్సింగ్ (31) లాటినాలో బుధవారం వ్యవసాయం క్షేత్రంలో పనిచేస్తుండగా, గడ్డిని కట్చేసే మిషన్లో చేయిపడి తెగిపోయింది. యజమాని వెంటనే కార్మికుడికి వైద్యసేవలు అందజేయకుండా ఇంటి వద్ద రోడ్డు పక్కన పడేశారు. ఇటలీలోని భారత రాయబార కార్యాలయం సింగ్ మరణాన్ని ధ్రువీకరించింది.