ఖమ్మం ఫొటోగ్రాఫర్;ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఏపీలోని తిరుపతి ప్రాంతంలో పెరిగే ‘పుంగనూరు జాతి ఆవు దూడ’. ఈ జాతి ఆవులను అక్కడి ప్రజలు పవిత్రంగా భావిస్తారు. వీటి పాలను ఆలయాల్లో అభిషేకాలకు వినియోగిస్తారు. ఖమ్మం జిల్లా అర్బన్ మండలం అల్లీపురానికి చెందిన రావూరి పెద్దరామయ్య అనే రైతు తిరుపతి నుంచి రూ.3 లక్షలు వెచ్చించి దీనిని తీసుకొచ్చి, పెంచుకొంటున్నాడు.