శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో కిలో బంగాం పట్టుకున్నారు. షార్జా నుంచి వచ్చిన వ్యక్తి వద్ద పేస్ట్ రూపంలో ఉన్న పసిడిని స్వాధీనం చేసుకున్నట్లు డిఆర్ఐ అధికారులు (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.43.55 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడిని విచారిస్తున్నట్లు వెల్లడించారు.