హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రోపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం (ఎస్టీయూ టీఎస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా జీ సదానంద్‌గౌడ్, ఎం పర్వతరెడ్డి ఎన్నికయ్యారు. శని, ఆదివారాల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేట్ అధ్యక్షులుగా ఏవీ సుధాకర్, వై కరుణాకర్‌రెడ్డి, అదనపు ప్రధాన కార్యదర్శులుగా ఈశ్వరయ్య, నారాయణస్వామి, ఉపాధ్యక్షులుగా వీరమణి, సాంబయ్య, ఆర్థిక కార్యదర్శిగా బీ రవి, కార్యదర్శులుగా విజయభాస్కర్‌రెడ్డి, జే లక్ష్మణ్, ఆర్థిక కమిటీ సభ్యులుగా నర్సింలు, బాలాజీ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.