హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాప్టర్ నూతన చైర్మన్‌గా పీఅండ్‌పీ నెక్స్‌జెన్ టెక్ ఎండీ డాక్టర్ రామ్‌కుమార్ రుద్రభట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీనియర్ వైస్ చైర్మన్‌గా దివ్యశ్రీ ఎన్ఎస్ఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీఎఫ్‌వో సీ నారాయణరావు, వైస్ చైర్మన్‌గా జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టు బిజినెస్ హెడ్ సౌరభ్ జైన్ ఎన్నికైనట్లు ఐఏసీసీ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కార్యవర్గ సభ్యులుగా అవినాష్ బాబు, ఎస్వీవీఎన్ అప్పారావు, సీహెచ్ రాజగోపాల్ చౌదరి, కే గణేశ్ సుబుధి, అన్వేష్ దాసరి, శ్రీదేవి దేవిరెడ్డి, పీ బాపిరాజు తదితరులు ఎన్నికైనట్లు తెలిపింది.