సంగారెడ్డి, అక్టోబర్ 8 : సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువతి మూడు ప్రభుత్వ పథకాల లబ్ధిపొందింది. 2015లో పెండ్లికి కల్యాణలక్ష్మి సాయం రూ.51 వేలు కుటుంబానికి ఆసరా అయ్యింది. 2020లో తొలి సంతానంగా పాప పుట్టడంతో కేసీఆర్ కిట్ అందుకున్నది. ముచ్చటగా మూడోసారి 2021 జనవరి 4న రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన షీ క్యాబ్స్‌కు అర్హత సాధించి మూడు పథకాలు పొందింది. సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డు సంతోష్‌నగర్ కాలనీలో నివాసముంటున్న పాతర తేజస్వీ. ‘ఎలాంటి పైరవీలు, పైసా ఖర్చులేకుండా పథకాల లబ్ధి పొందా. ప్రజా సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న ఫలాలు ప్రజల దరిచేరుతున్నయి. నాలాంటి అదృష్టం పేద మహిళలందరికీ కలగాలని కోరుకుంటున్నా. సీఎం కేసీఆర్‌కు మా కుటుంబం రుణపడి ఉంటుందని’ తేజస్వి సంబురంగా చెప్పారు.