నల్లగొండ : తెలంగాణ రాష్ట్రం గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో గొప్పగా అభివృద్ధి చెందింది. అభివృద్ధిలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Sukhender Reddy )అన్నారు. ఆదివారం కొండమల్లెపల్లి మండల కేంద్రంలోని జడ్పీటీసీ సరస్వతమ్మ నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దక్షత వల్లే రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఆగకుండా ఉండాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అధికారం ఇస్తే రాష్ట్రం కుక్కలు చింపిన ఇస్తారని అవుతుందని హెచ్చరించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా మూడోసారి గెలిచి, హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. ఈ నెల రోజులు బీఆర్ఎస్ పార్టీ నేతలు కష్టపడితే మళ్లీ ఐదు సంవత్సారలు అదరూ సంతోషంగా ఉంటారని పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 12 కూడా బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీలో చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి. అలాగని పార్టీనే వదిలేయడం కరెక్ట్ కాదు. ఓకే కుటుంబంలో ఉన్నప్పుడు మనస్పర్థలు కూడా వస్తాయి. ఎన్నికల సమయంలో అన్ని సర్దుకుపోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎన్నికల సమయంలో వచ్చేవారు వస్తుంటారు. వెళ్లేవారు వెళుతుంటారు. ఎవరు కూడా అధైర్య పడొద్దు. పార్టీ ఆదేశాల ప్రకారం పని చేసుకుంటూ భవిష్యత్లో అవకాశాలు తప్పకుండా వస్తాయన్నారు.