ప్రచారంలో బండారుకు బ్రహ్మరధం పట్టిన ప్రజలు.
రామంతాపూర్, అక్టోబర్ 18: ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని గెలిపించాలని, కారు గుర్తుకు ఓటేయాలని నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ కోరుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం హబ్సిగూడ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గడపగడపకు తిరుగుతూ ఓటువేయమని ప్రజలను కోరారు. డివిజన్లో మహిళలు , యువకులు, పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ , అభివృద్ధి ఫలా లు ప్రజలు చేరుతున్నాయన్నారు. రైతులకు, వృద్ధులకు,, మహిళలకు, యువకులకు ముఖ్య మంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ బీవీచారి, సోమిరెడ్డి, తిప్పని సంపత్‌కుమార్, యాకాంత్రావు, యాదమ్మ, ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, బుచ్చిరెడ్డి, సంపత్‌రావు, జహంగీర్, అక్బర్, స్థానికులు పాల్గొన్నారు.
కాప్రా, అక్టోబర్ 18: కాప్రా డివిజన్లోని సాయిరాంనగర్‌లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు గడప, గడపకు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. స్థానిక ప్రజలు సీఎం కేసీఆర్ పాలన పట్ల సంతృప్తి, సంతోషం వ్యక్తం చేస్తూ ఎన్నికల్లో బీఆర్ఎస్కు తప్పక మద్దతు ఇస్తామని, బీఎల్ఆర్కు ఓటేస్తామని సానుకూలంగా స్పందిస్తున్నారని పార్టీ శ్రేణు లు చెప్పారు. ఉప్పల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో నాయకులు బైరి నవీన్‌గౌడ్, గిల్బర్ట్, ఎన్.మహేశ్, బంక వెంకటేశ్, బైరి భాస్కర్‌గౌడ్, కొండల్‌గౌడ్, సోమ్‌నాథ్, మచ్చపాండు, వంశరాజ్ మల్లేశ్, రాజు, వస్ర్తాల వెంకటేశ్, శివకుమార్, చందు, శ్రీకాంత్, ఎండీ గౌస్, ఎండీ అలీ, బడా గౌస్, రఫీక్, నర్సింహ, రవీందర్‌రెడ్డి, భిక్షపతి, గణేశ్, దేవి, సారా మాధురి తదితరులు పాల్గొన్నారు.
కాప్రా డివిజన్ వంపుగూడ విలేజీ, వంపుగూడ కాలనీలో గురువారం ఉదయం 7.30 గంటలకు బీఆర్ఎస్ ప్రచారం ప్రారంభమవుతుందని, ఉప్పల్ నియోజకవర్గం ఇన్చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి, ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ ప్రచారానికి హాజరవుతారని స్థానిక కార్పొరేటర్ స్వర్ణరాజు తెలిపారు.
మల్లాపూర్, అక్టోబర్ 18 : ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన మల్లాపూర్ డివిజన్ శక్తిసాయినగర్, మల్లికార్జుననగర్ కాలనీలలో కార్యకర్తలు ,నా యకులతో కలిసి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఇంటింటికి తిరుగుతూ కాలనీవాసులకు అవగాహన కల్పించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మీర్పేట్ హెచ్‌బీకాలనీ డివిజన్ పరిధిలోని నవోదయనగర్, రాజీవ్‌నగర్ కాలనీలలో కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ జి. శ్రీనివాస్‌రెడ్డి గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి , సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకు లు జంపాల్రెడ్డి, రాజ్‌కుమార్, అశోక్, జయపాల్, ఎల్లయ్య, నరహరి, నవీన్‌గౌడ్, రమేశ్, కుమార్, రామకృష్ణ, మహిళా నేతలు భాగ్యమ్మ, ఫర్వీన్, కృష్ణవేణి, జ్యోతి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పావనీ మణిపాల్రెడ్డిలు కోరారు. ఈ మేర కు బుధవారం ఏఎస్‌రావునగర్ డివిజన్ పరిధిలోని టీఎస్ఐఐసీ కాలనీలో గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కాసం మహిపాల్‌రెడ్డి, బేతాళ బాల్‌రాజ్, కుమారస్వామి, మురళీ పంతులు, లక్ష్మీనారాయణ, శిరిషారెడ్డి, శోభారెడ్డి, మల్క రమాదేవి, రాములు, నాగేశ్వర్‌రెడ్డి, సింగారపు రాజు, ఎస్.ఎ రహీమ్, బాల్‌నర్సింహ పాల్గొన్నారు.