వరంగల్ : జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli)కు వివిధ వర్గాల నుంచి మద్దతు వెల్లువలా కొనసాగుతున్నది. తాజాగా హైదరాబాద్లో స్థిరపడిన రాయపర్తి మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు మంత్రి ఎర్రబెల్లికి మద్దతు తెలిపారు. దసరా పండుగ కోసం గ్రామానికి వచ్చిన వారు మంత్రి స్వగ్రామం వరంగల్ జిల్లా పర్వతగిరిలో ప్రత్యేకంగా కలిశారు.
వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు మంత్రికేనని స్పష్టం చేశారు. మంత్రిని కలిసిన వారిలో ఇటిక్యాల సుమన్, కడుదుల వెంకటేష్, సురవు ప్రవీణ్, ఎంగిలి అనిల్, వరికాల రామకృష్ణ, ఇటిక్యాల హరీష్, గుల్లపెల్లి ప్రసాద్, తుమ్మరపెల్లి రంజిత్, పెండ్లి సుధాకర్, గాజులపాటి నర్మద, తోట సుదర్శన్, కడుదుల సురేష్ తదితరులు ఉన్నారు.