‘నీవు మాట్లాడే విషయంతో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ, నీ మాట్లాడే హక్కు కోసం నా ప్రాణమిచ్చి పోరాడుతా’ అన్నాడు ప్రముఖ తత్వవేత్త, స్వేచ్ఛా స్వాతంత్య్రాల ప్రబోధకుడు వాల్టేర్.
విప్లవానికి ముందు ఫ్రెంచ్ పరిపాలనా వ్యవస్థ అవకతవలతో నిండి ఉంది. నిరంకుశత్వం, అరాచకం అన్ని రంగాలకు విస్తరించింది. రాజకుటుంబం నివసించే వర్సేకోట విందులు విలాసాలకు...