దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. బ్లూచిప్ సంస్థల షేర్ల నుంచి లభించిన మద్దతుతోపాటు విదేశీ మదుపర్లు పెట్టుబడులు పెట్టడంతో ఇరు సూచీలు ఒక్క శాతానికి పైగా ఎగబాకాయి.
స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. ఐటీ, టెక్నాలజీ, టెలికం రంగ షేర్లలో క్రయ విక్రయాలు జరగడంతో వరుసగా తొమ్మిది రోజులుగా లాభపడిన సూచీలు భారీగా నష్టపోయాయి.
అమెరికా ద్రవ్యోల్బణం ఏడు నెలల కనిష్ఠానికి తగ్గిందన్న వార్తతో కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున ర్యాలీ జరిపిన స్టాక్ మార్కెట్లు గతవారం తిరిగి ఒడిదుడుకుల బాటలోకి మళ్లాయి.