తొమ్మిది రోజుల ర్యాలీకి బ్రేక్
స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. ఐటీ, టెక్నాలజీ, టెలికం రంగ షేర్లలో క్రయ విక్రయాలు జరగడంతో వరుసగా తొమ్మిది రోజులుగా లాభపడిన సూచీలు భారీగా నష్టపోయాయి.
- భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు
- 60 వేల పాయింట్ల దిగువకు సెన్సెక్స్
ముంబై, ఏప్రిల్ 17: స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. ఐటీ, టెక్నాలజీ, టెలికం రంగ షేర్లలో క్రయ విక్రయాలు జరగడంతో వరుసగా తొమ్మిది రోజులుగా లాభపడిన సూచీలు భారీగా నష్టపోయాయి. నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతోపాటు వచ్చే ఏడాది ఆదాయ అంచనాల్లో కోత విధించడంతో ఇన్ఫోసిస్ షేరు కుప్పకూలింది. ఈ షేరు మార్కెట్లను మరింత నష్టాల్లో కురుకునేలా చేసింది. నష్టాల్లో ప్రారంభమైన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ ఒక దశలో 988.53 పాయింట్లు లేదా 1.63 శాతం తగ్గింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 520.25 పాయింట్లు నష్టపోయి 60 వేల దిగువకు 59,910.75 పాయింట్లకు జారుకున్నది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 121.15 పాయింట్లు కోల్పోయి 17,706.85 వద్ద నిలిచింది.
- ఇన్ఫోసిస్ 9.40 శాతం తగ్గి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు టెక్ మహీంద్రా 5.25 శాతం కోల్పోయింది.
- హెచ్‌సీఎల్ టెక్, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ, విప్రో, హెచ్డీఎఫ్సీ, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు ఒక్కశాతానికి పైగా పతనం చెందాయి.
- వీటితోపాటు ఎయిర్టెల్, సన్‌ఫార్మా, టాటా స్టీల్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్‌లు నష్టపోయాయి.
- కానీ, నెస్లె, పవర్‌గ్రిడ్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, కొటక్ బ్యాంక్, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్, టైటాన్, మహీంద్రా, హెచ్‌యూఎల్, టాటా మోటర్స్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతిలు లాభాల్లో ముగిశాయి.
- రంగాలవారీగా చూస్తే ఐటీ సూచీ 4.77 శాతం కోల్పోగా..టెక్ 4.56 శాతం, ఇండస్ట్రియల్, క్యాపిటల్ గూడ్స్ నష్టపోయాయి.
- కమోడిటీస్, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగ సూచీలు లాభాల్లో ముగిశాయి.
- ఐటీసీ షేరు ధర రికార్డు స్థాయికి చేరుకున్నది. 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.401.95 వద్ద ముగిసింది. గడిచిన ఏడాదికాలంలో కంపెనీ షేరు 50 శాతం ఎగబాకింది.
కుప్పకూలిన ఇన్ఫోసిస్
ఇన్ఫోసిస్ షేరు కుప్పకూలింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతోపాటు ఈ ఏడాది ఆదాయంలో 4-7 శాతంలోపు వృద్ధి నమోదు కానున్నదని అవుట్‌లుక్‌లో పేర్కొనడం మదుపరులకు రుచించలేదు. దీంతో ఇంట్రాడేలో 12 శాతానికి పైగా నష్టపోయిన షేరు చివరకు 9.40 శాతం నష్టంతో రూ.1,258.10 వద్ద ముగిసింది. ఎన్ఎస్సీలోనూ సంస్థ షేరు 9.37 శాతం పడిపోయింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.59,350 కోట్లు కోల్పోయి రూ.5,21,930.34 కోట్లకు జారుకున్నది.
‘ఆర్థిక ఫలితాలు ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ఈ వారం మార్కెట్ ట్రెండ్‌పైనా కూడా ఈ ప్రభావం కనిపించనున్నది’
– వినోద్ నాయర్, జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

